News September 14, 2025
సెప్టెంబర్ 17 నుంచి స్వస్త్ నారీ-సశక్త్ పరివార్: కలెక్టర్

జనగామ జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమమని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. ANC తనిఖీలు చేపట్టి రోగనిరోధక శక్తిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మెగా రక్తదానం కూడా జరుగుతుందన్నారు.
Similar News
News September 14, 2025
HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
News September 14, 2025
ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.
News September 14, 2025
ములుగు సమగ్ర స్వరూపంపై పుస్తకం రూపకల్పన

తెలంగాణా సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా సమగ్ర స్వరూపం అనే పుస్తకాన్ని వెలువరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా చరిత్ర, నైసర్గిక స్వరూపం, నీటిపారుదల, వ్యవసాయం, పర్యాటక, విద్యా, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, కళా రంగాలు, ఇతర అంశాలపై రచయితల నుంచి వ్యాసాలు ఆహ్వానిస్తున్నామని, అమ్మిన శ్రీనివాసరాజు 7729883223, కె. వెంకటరమణ 9849905900లకు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.