News October 12, 2025

సెమీఫైనల్ చేరుకున్న చిత్తూరు జిల్లా టీం

image

రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్‌కు చిత్తూరు జిల్లా టీం చేరుకుంది. కడప YSR స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి. సెమీ ఫైనల్‌లో అర్హత కోసం తిరుపతి, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో చిత్తూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు గోపీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ నెల 19న అనంతపురంలో జోన్ ఫోర్ సెమీఫైనల్స్ జరుగునున్నాయి.

Similar News

News October 12, 2025

అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు!

image

నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్ అంతరిక్షం నుంచి తీసిన హిమాలయ పర్వతాల ఫొటో SMలో వైరల్ అవుతోంది. తెల్లటి మంచు, మేఘాలతో కనుచూపు మేర ఉన్న పర్వతాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలో హిమాలయాలతో పాటు ఎవరెస్ట్‌ పర్వతం, నేపాల్ భూభాగం సైతం కనిపిస్తోందని వ్యోమగామి వెల్లడించారు. ఇటీవల బిహార్‌లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

News October 12, 2025

TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286‌ను సంప్రదించాలన్నారు.

News October 12, 2025

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

image

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.