News February 9, 2025

సెమీస్‌కు అనకాపల్లి జిల్లా మహిళల హాకీ జట్టు

image

అనకాపల్లి జిల్లా సీనియర్ మహిళల హాకీ జట్టు సత్తా చాటి సెమీస్‌కు చేరింది. అంతర్ జిల్లాల మహిళల హాకీ పోటీలు నెల్లూరు జరుగుతున్నాయి. నెల్లూరు జట్టుపై అనకాపల్లి జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో తరబడి 0-5 గోల్స్ తేడాతో గెలుపుపొందిందని అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొఠారు నరేశ్ తెలిపారు. ఈనెల 8 నుంచి పోటీలు జరుగుతున్నాయన్నారు.

Similar News

News July 4, 2025

సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు: కలెక్టర్

image

సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగుల అవసరాలను తీర్చడంలో సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నారు. సామాజిక సంక్షేమం పట్ల ఎస్పీఎం యాజమాన్యం తీరును అభినందించారు.

News July 4, 2025

నల్గొండ: మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన

image

IPR సెల్ MGU నల్గొండ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, TG స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచన, ఆచరణాత్మక దృక్పథానికి, క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించడం సులువు అని అన్నారు.

News July 4, 2025

‘కోడిగుడ్ల సరఫరాకు వివరాలు ఇవ్వండి’

image

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లా స్థాయి కోడిగుడ్ల సేకరణ, కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల, ఆశ్రమ, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు, ఫూలే పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు అందించేందుకు వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.