News October 7, 2024
‘సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనానికి తీర్మానం’

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.
Similar News
News April 9, 2026
విశాఖ: ఇరాన్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన కలెక్టర్

యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా సంజీవని నిధి నుంచి రూ.50 వేలు విలువ గల చెక్కును, కనకమహాలక్ష్మి దేవస్థానం సమకూర్చిన రూ.50 వేలు నగదును కలెక్టర్ తన ఛాంబర్లో గురువారం అందించారు. ఏయూలో ఫార్మసీ కోర్సు చదువుతున్న జినాబ్, సోల్మాజ్ బుధవారం వినతి అందజేశారు.
News April 9, 2026
చందనోత్సవం.. ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు’

సింహాచలంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్త్ కిషోర్ గురువారం పరిశీలించారు. చందనోత్సవ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఈవో వెంకట్రావు జరుగుతున్న పనులు, చేపడుతున్న భద్రతా చర్యలను కలెక్టర్‌కు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News April 9, 2026
కేజీహెచ్‌లో వార్డు బాయ్‌పై మేల్ నర్స్ దాడి..!

KGHలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ మేల్ నర్స్ పైడ్రాజు తనపై దాడి చేసినట్లు వార్డ్ బాయ్ అప్పలస్వామి ఆరోపించారు. తన మనవరాలు ప్రియాంక (పేషెంట్)ను ఆస్పత్రిలో చేర్చారు. సెలైన్ సరిగా పెట్టకపోవడంతో ఇబ్బంది పడినట్లు ప్రియాంక తన తాతకు చెప్పింది. దీంతో అక్కడే ఉన్న పైడ్రాజుని అడగ్గా తనపై దాడి చేసినట్లు అప్పలస్వామి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపారు.


