News September 21, 2025
సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు: చిత్తూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.
Similar News
News September 22, 2025
చిత్తూరు: RTCలో అప్రెంటీస్ షిప్‌కు నోటిషికేషన్

APSRTC అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DPTO జగదీష్ తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో డీజల్ మెకానిక్స్ 33, మోటర్ మెకానిక్స్ 2, ఎలక్ట్రీషియన్స్ 8, వెల్డర్ 1, ఫిట్టర్ 3 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా పరిధిలో ITI చదివిన వారు మాత్రమే అర్హులు. అక్టోబర్ 4వ తేదీ లోపు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 22, 2025
పెద్ద పంజాని: బెట్టింగ్ యాప్ మోసగాడి అరెస్ట్

బెట్టింగ్ యాప్ మోసగాడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన చంద్రబాబు బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసేవాడు. ఈ నేపథ్యంలో రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వద్ద షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతానని నమ్మించి రూ.2 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా అతడి బ్యాంకు అకౌంటుకు ఇతని మొబైల్ నెంబరును లింకు చేసుకుని దాదాపు రూ.కోటికి పైగా మోసం చేశాడు.
News September 22, 2025
పెనుమూరు : మహిళా పోలీస్ సస్పెండ్

పెనుమూరు మండలంలోని సీఆర్. కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. పెనుమూరు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదని అన్నారు. కారణం ఏమిటని అడగ్గా సమాధానం సక్రమంగా లేని కారణంగా చర్యలు చేపట్టారు.