News June 11, 2024
సెల్ఫీ తీసుకుంటూ హైదరాబాద్ యువకుడి మృతి
విహార యాత్రకు వెళ్లిన యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా తరికెరె తాలూకా హెబ్బె జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి నీటిలో పడి శ్రవణ్ (25) అనే యువకుడు సోమవారం మరణించాడు. అతడు HYD వాసిగా పోలీసులు గుర్తించారు. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి వెళ్లగా వాటర్ ఫాల్స్‌లోకి జారి పడినప్పుడు తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు.
Similar News
News January 16, 2025
3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
News January 16, 2025
సికింద్రాబాద్‌లో ముగిసిన కైట్ ఫెస్టివల్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.
News January 15, 2025
జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.