News September 11, 2025
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ రైతాంగం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వ్యవసాయ మిషన్ అమలుపై అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 11, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.
News September 11, 2025
VKB: ‘పశువులకు అందుబాటులో మందులు’

జిల్లాలో పశువులకు ఎలాంటి వ్యాధులు ప్రబలిన మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశువైద్యాధికారి సదానందం తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో పశువుల మందులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి వ్యాధులు సోకిన చికిత్సలు అందించి మందులు అందిస్తామన్నారు. సబ్సిడీపై 75% గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
News September 11, 2025
గోదావరిఖని: ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: CPI

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రామగుండం నగర CPI కార్యదర్శి కే.కనకరాజు పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.