News February 7, 2026

సేవాలాల్ జయంతికి ప్రత్యేక బస్సులు: జేసీ విష్ణుచరణ్

image

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గుత్తి – గుంతకల్లు మధ్య సేవాగఢ్ వద్ద బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కేటాయించాలని సూచించారు. జయంతి వేడుకలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 16, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌‌లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్‌లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్‌ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.

News February 16, 2026

పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పన్నుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. కోట్లాది రూపాయల పన్నులు పెండింగ్‌లో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీనెల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 16, 2026

ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

రైతులు ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పథక పోస్టర్లను ఆవిష్కరించారు. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఆటోమేషన్‌కు హెక్టారుకు రూ.40,000 సూచిక వ్యయంపై సబ్సిడీ అందుతుందని తెలిపారు. నీటి వృథా తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం లేదా ఉద్యానవన కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.