News February 24, 2025
సేవాలాల్ మహారాజ్ వార్షికోత్సవంలో పాల్గొన్న జాన్సన్ నాయక్

ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఆదివారం బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ జాన్సన్‌నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయకమిటీ సభ్యులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఆయన వెంట ఖానాపూర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.
News July 6, 2025
CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. <
News July 6, 2025
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత పరిశీలన

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, వాష్ రూమ్స్, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. పరిశుభ్రతపై తనిఖీ చేసేందుకు బృందాలు త్వరలోనే పర్యటించనున్నారు. జిల్లాలో 1,108 పాఠశాలలో ఉండగా, 82,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.