News August 24, 2025
సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది: జిల్లా SP

ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.
Similar News
News August 24, 2025
ఒంగోలు రాజకీయాలు.. 2 రోజుల్లో క్లారిటీ

ఒంగోలు టీడీపీ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకై అధిష్ఠానం నియమించబడ్డ ప్రతినిధులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. అయితే అధ్యక్ష పదవికి ముగ్గురు ఎమ్మెల్యేలు, మరొకరు నామినేటెడ్ పోస్ట్ గల ప్రతినిధి పోటీలో ఉన్నట్లు సమాచారం. 2 రోజుల్లో టీడీపీ అధిష్ఠానం పార్లమెంట్ కమిటీని ప్రకటించనుంది.
News August 24, 2025
వై.పాలెం: తెలుగులో టాపర్‌గా మనోహర్

ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లికి పుచ్చనూతల మనోహర్ DSCలో సత్తా చాటాడు. SA తెలుగులో 84.82 మార్కులతో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. TGTలో 74.4 మార్కులతో 28వ ర్యాంక్ పొందాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో అతడిని పలువురు అభినందించారు.
News August 24, 2025
ఒంగోలు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో..?

ఒంగోలులో TDP సమావేశం ఆదివారం జరగనుంది. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడి ఎంపికపై త్రీ మెన్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరించనుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. యువనేత దామచర్ల సత్యతో పాటు మరికొందరు రేసులో ఉన్నట్లు సమాచారం. ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు?