News August 24, 2025
సైదాపురం: తండ్రి కల నెరవేర్చిన కుమారుడు

నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం అనంతమడుగు గ్రామపంచాయతీ అరుంధతి వాడకు చెందిన లేట్ కత్తి సుబ్బయ్య పెద్ద కుమారుడు కత్తి శ్రీనివాసులు డీఎస్సీ పరీక్షలో సత్తా చాటారు. డీఎస్సీలో డిస్టిక్‌లో ఎస్ఏలో 19వ ర్యాంకు, TGTలో 40, PGTలో 17వ ర్యాంకు సాధించారు. డీఎస్సీలో ఉద్యోగం సాధించి తన తండ్రి కల, ఊరి పేరు నిలబెట్టాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News August 25, 2025
నెల్లూరు: మద్యం కోసం కత్తితో బావనే బెదిరించాడు

మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో సొంత బావనే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. జ్యోతి నగర్‌కు చెందిన సాజిద్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన బావ సంధానిని అడిగాడు. అతను లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 తీసుకున్నాడు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News August 25, 2025
నెల్లూరు: జీవిత ఖైదు మృతి

అనారోగ్యంతో జీవిత ఖైదీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా మైపాడుకు చెందిన షేక్ కాలేషా(64) ఓ వ్యక్తిని హత్య చేసి నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో నెల్లూరు జైలు పోలీసులు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
News August 25, 2025
నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.