News March 26, 2025
సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 31, 2025
పెద్దమ్మ తల్లి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ

పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరు బాగుండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉగాది పండుగ సందర్భంగా జరిగే జాతరలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధులుగా పాల్గొని ఎడ్ల బండిపై గుడి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.
News March 31, 2025
ములుగు: బస్టాండ్ లేక ఇక్కట్లు.. అందుకే ప్రమాదాలు!

మల్లంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు-హనుమకొండ జాతీయ రహదారిపై ఉన్న ఈ మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు బస్సుల కోసం జాతీయ రహదారిపైనే నిలబడుతున్నారు. దీంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News March 31, 2025
భార్య పుట్టింటికి వెళ్లడంతో.. భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన గుంజ చిన్న రామారావు(28) తన భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.