News August 17, 2025
సైనికులను తయారు చేసే గ్రామం ధనసిరి

సంగారెడ్డి జిల్లాలోని ధనసిరి గ్రామం దేశానికి సైనికులను అందించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి సుమారు 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ధనసిరిలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు సైన్యంలో ఉండడం ఈ గ్రామానికి గర్వకారణంగా మారింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సేవలో ఈ గ్రామానికి చెందిన జవాన్లు నిమగ్నమై ఉన్నారు.
Similar News
News August 17, 2025
సంగారెడ్డి: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల పేర్కొన్నారు. వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయన్నారు.
News August 17, 2025
కాకినాడ: పులసమ్మ.. నీ జాడ ఏదమ్మా..?

ఎక్కడో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఉమ్మడి తూ.గో జిల్లాకి వలస వచ్చే పులస చేపలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. ఇప్పటివరకు పట్టుమని పది కూడా దొరకలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో పులస ప్రియులు నిరాశ చెందుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో “పులసమ్మా.. పులసమ్మా.. నీ జాడ ఏదమ్మా” అంటూ పాటలు కూడా పాడుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు నకిలీ చేపలను పులసగా అమ్ముతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
News August 17, 2025
MNCL: జిల్లాలో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 135.8 సెంటీమీటర్లు.. అత్యల్పంగా చెన్నూర్ లో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 122.6, నెన్నెలలో 89.6, హాజీపూర్ లో 79.8, మంచిర్యాలలో 76.4, జైపూర్ లో 72.6, నస్పూర్ లో 62, తాండూరులో 68.2, కోటపల్లిలో 24.6, బెల్లంపల్లిలో 37.4, లక్షెట్టిపేటలో 35 సెంటీమీటర్ల వర్షం పడింది.