News October 12, 2025

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానం

image

జాతీయ స్థాయిలో జరిగే సైనిక్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతికి 01.04.2014 నుంచి 31.03.2016 మధ్య జన్మించి ఉండాలి. 9 వ తరగతి ప్రవేశాలకు 01.04.2011 నుంచి 31.03.2013 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News October 12, 2025

నిర్మల్: ఈ నెల 14 జిల్లా బ్యాట్మెంటన్ జట్ల ఎంపిక

image

U- 14, 17 జిల్లాస్థాయి బ్యాట్మెంటన్ బాలబాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయంలో హాజరుకావాలని సూచించారు.

News October 12, 2025

కాంగ్రేస్ జిల్లా అధ్యక్ష బరిలో 8 మంది దరఖాస్తులు

image

జయశంకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన జిల్లాకు చెందిన నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తూ తమ బయోడేటాను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డికి దరఖాస్తులను అందజేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పేర్లను త్వరలో అధిష్ఠానానికి పంపి ఎంపిక చేయనున్నారు.

News October 12, 2025

చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!

image

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.