News February 23, 2026

సైన్స్ సమగ్ర మహోత్సవం.. ప్రాజెక్టుల అప్‌లోడ్‌కు DEO పిలుపు

image

నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సైన్స్ సమగ్ర మహోత్సవం’ కోసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని DEO పి.నాగేశ్వరరావు సూచించారు. ప్రదర్శనలకు సంబంధించిన ఫోటోలు, 3నిమిషాల నిడివి గల వీడియోలను sciencesamagra.in పోర్టల్‌లో సమర్పించాలని కోరారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టులను ఎంపిక చేసి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

Similar News

News February 23, 2026

విశాఖ: సేవ పునర్విక పేరుతో దోపిడీ

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా సోమవారం సేవ్ పునర్విక పేరుతో స్కానర్లు పట్టుకుంటూ సేవ పేరుతో ముగ్గురు వ్యక్తులు అనధికార దోపిడీకి తెర లేపారు. కనీసం ఆ పాప పేరు పలకడం తెలియడం లేదు వాళ్లకి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భీమవరానికి చెందిన వారిమని చెబుతున్నారు. స్థానికులు కాదు సేవ తప్పు దోవ పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News February 23, 2026

నారాయణపేట: MLAకు మద్దతుగా BJP నిరసన

image

నారాయణపేట జిల్లా మరికల్‌లో సోమవారం బీజేపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మండలాధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 23, 2026

అష్టలక్ష్మి: సంతానలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

సంతానలక్ష్మి దేవికి పచ్చని వస్త్రాలు, పూలను సమర్పించి ఆరాధించాలి. పచ్చ రంగు వంశాభివృద్ధికి, చిగురించడానికి సంకేతం. ఓ మొక్క ఎలాగైతే పచ్చగా ఉండి కొత్త కొమ్మలను ఇస్తుందో అలాగే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానాన్ని ఈ దేవి ప్రసాదిస్తుంది. పచ్చని పుష్పాలతో పూజిస్తే సంతాన దోషాలు పోతాయని నమ్మకం. అలాగే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా, బుద్ధిమంతులుగా పెరుగుతారని పండితులు చెబుతున్నారు.