News April 10, 2024
సైబర్ క్రైమ్ కేసులో నిందితులుగా నెల్లూరురోళ్లు

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.
Similar News
News October 5, 2025
నెల్లూరు జిల్లాలో వింత జ్వరాలు..!

నెల్లూరులో వింత జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ఓ రకమైన కీటకం కుట్టడంతో వెంకటేశ్వరపురం, కావలి, ఎన్టీఆర్ నగర్, మనుబోలు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ జ్వరం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలను ఈ కొత్త రకం జ్వరం భయపెడుతోంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని.. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News October 5, 2025
KHOJ టూల్, సైబర్ నేరాలపై అవగాహన

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా KHOJ టూల్, సైబర్ నేరాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డా. అజిత వేజెండ్ల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
News October 5, 2025
వ్యవసాయ విజేతలను ఎంపిక చెయ్యండి : కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఛాంపియన్ ఫార్మర్ ఎంపిక చేసి, వ్యవసాయంలో నూతన విధానాల అమలు ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. యాంత్రీకరణపై జరిగిన వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు.