News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 21, 2026
చీపురు పట్టిన నంద్యాల కలెక్టర్

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. జీవిత విధానంలో శుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.
News February 21, 2026
వికసిత్ భారత్‌కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్‌కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్‌లో చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్‌కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
‘వన్ హెల్త్’ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

ప్రతిష్టాత్మక ‘వన్ హెల్త్’ పైలట్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపికైనట్లు DMHO డాక్టర్ వసంతరావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర బృందం ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనుందని వెల్లడించారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


