News December 13, 2025

సైబర్‌ నేరగాళ్లపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదం

image

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.

Similar News

News December 20, 2025

విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.

News December 20, 2025

కరీంనగర్: జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ బాలుర మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న 1 గణితం జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఔట్ సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి మ్యాథ్స్ లో పీజీ చేసి 50 శాతం మార్కులుండి బీ.ఎడ్ చేసిన వారు అర్హులని, ధరఖాస్తులు ఈ నెల 29 వరకు కరీంనగర్ మైనారీటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 08782957085 లో సంప్రదించగలరు.

News December 20, 2025

కరీంనగర్ డీసీసీబీ పర్సన్ ఇంచార్జీ‌గా జిల్లా కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (DCCB)కు పర్సన్ ఇంచార్జిగా జిల్లా కలెక్టర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సహకార శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవడం, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో, సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.