News August 27, 2025

సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. లక్ష పోగొట్టుకున్న విద్యార్థిని

image

ఏలూరు రూరల్ మండలం ప్రతి కోళ్ల లంక గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోతి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది. వాట్సాప్‌లో వచ్చిన ఒక లింక్‌ను నమ్మి, డబ్బులు రెట్టింపు అవుతాయని భావించి ఆమె తన లక్ష రూపాయలను దఫదఫాలుగా పెట్టుబడి పెట్టి మోసపోయింది. ఈ ఘటనపై ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News August 27, 2025

NLG: వినాయక చవితి పూజా పత్రికి డిమాండ్

image

వినాయక చవితి పూజా పత్రి విక్రయాలు ఉమ్మడి NLG జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లా, మండల కేంద్రాల రైతుబజార్లు, రోడ్లపై రద్దీ ఉంది. మారేడు పత్రి, పచ్చిగరుక, మర్రి ఊడలు, కరక్కాయ, ఎలక్కాయలకు చాలా డిమాండ్ ఉంది. నైవేద్యంగా సమర్పించే పచ్చగూరలు, అరటి, చెరుకు కొమ్మలు కొంటున్నారు. పూల ధరలకూ రెక్కలొచ్చి బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, లూజ్ పువ్వులకు డిమాండ్ పెరిగింది. వెదురు పాలవెల్లి, కలర్స్ పల్లకిలు ఉన్నాయి.

News August 27, 2025

రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పాత షెడ్యూల్‌లోనే

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న వర్క్‌ల కారణంగా కొంతకాలంగా చర్లపల్లి వరకు మాత్రమే నడుస్తున్న రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పూర్తి రూట్‌లోనే నడవనుంది. సెప్టెంబర్ 10 నుంచి రైలు(17645) సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.40కు బయలుదేరి రేపల్లె చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రైలు(17646) రేపల్లె నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుతుందని అధికారులు ప్రకటించారు.

News August 27, 2025

ఊర్కొండలో 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటలలో నాగర్కర్నూల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉర్కొండ మండలంలో అత్యధికంగా 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తాడూరులో 64.2, ఉప్పునుంతలలో 59.4, కల్వకుర్తిలో 56.4, వెల్దండలో 50.6, తిమ్మాజీపేటలో 61.8, బిజినేపల్లిలో 49.6, వంగూరులో 45.2, పెద్ద కొత్తపల్లిలో 45.2, తెలకపల్లిలో 43.6, పదరలో 44.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.