News January 19, 2026
సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 30, 2026
9 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వండి: కలెక్టర్

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా పంట రుణాలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కేడీసీసీ బ్యాంక్‌కు సంబంధించి జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా బృందాలకు 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందించాలన్నారు.
News January 30, 2026
కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

బస్సు ప్రయాణాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రద్దీని అదునుగా చూసుకుని దొంగలు ఆభరణాలు, బ్యాగులు అపహరిస్తున్నారని తెలిపారు. అపరిచితులను నమ్మవద్దని, తెలియని వారి నుంచి ఆహారం తీసుకోవద్దని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.