News October 24, 2025

సైబర్‌ నేరస్థులను పట్టుకోవాలి: వరంగల్ సీపీ

image

సైబర్‌ నేరాలు జరిగినప్పుడు కేవలం కేసులు నమోదు చేసి, బాధితులు నష్టపోయిన సొమ్మును తిరిగి ఇప్పించడమే పోలీసుల బాధ్యత కాదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అధికారులకు సూచించారు. నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు కృషి చేయాలని ఆదేశించారు. నేరస్థులను అరెస్టు చేయడం ద్వారా సైబర్‌ నేరాలు జరగకుండా సమర్థంగా కట్టడి చేయవచ్చని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2025

బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

image

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.