News August 14, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

నందమూరులోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడారు. డిజిటల్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు.
Similar News
News August 15, 2025
కృష్ణా: పెరిగిన వరద.. ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.

మచిలీపట్నం: ఆగస్టు 15 సర్వం సిద్ధం

మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు గురువారం పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. అతిథులు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.