News September 20, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌస్ ఆలం

ఆన్లైన్లో వచ్చే అపరిచిత లింకులు, మెసేజ్‌లు, ఏపీకే ఫైళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, ఇతరుల నుంచి మీ ఖాతాలోకి డబ్బులు స్వీకరించవద్దని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News September 20, 2025
ఆర్థిక నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి: సీపీ గౌస్ ఆలం

ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షర చిట్‌ఫండ్, క్రిప్టో కరెన్సీ కేసులతో సహా అన్ని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు వారి సొమ్ము తిరిగి ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.
News September 19, 2025
KNR: బతుకమ్మ, దసరా పండుగ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ (రేపటి) నుంచి OCT 1వ తేదీ వరకు JBS నుండి KNRకు 1321 బస్సులు, OCT 2వ తేదీ నుంచి 13 తేదీ వరకు KNR నుంచి JBSకు 1330 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ కోసం వెబ్సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని సూచించారు.
News September 19, 2025
KNR: పత్తి సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారంసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.