News January 25, 2025
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: పార్వతీపురం ఎస్పీ

ఐటీ, సైబర్ సెక్యూరిటీలపై యువతకు అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే నంబర్ 1930ని సంప్రదించాలన్నారు.
Similar News
News September 16, 2025
అన్నమయ్య: సన్నిహితులే రాక్షసులు

మన చుట్టూ సన్నిహితంగా ఉండే వారే రాక్షసులుగా మారి బాలికల్ని చిదిమేస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని <<17714750>>మదనపల్లె<<>>, <<17720487>>తంబళ్లపల్లె<<>>లో జరిగిన 2 అత్యాచార ఘటనలు బాలికలపై ఉన్న భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
News September 16, 2025
ఏలూరు: కాలువలో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

ఏలూరు కొత్తూరు జూట్ మిల్లు వద్ద కాలువలో లభ్యమైన మృతదేహాన్ని గ్రీన్ సిటీకి చెందిన కోట ప్రసాద్ (48)గా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడంతో పడమర లాకుల్లో పడి కొట్టుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.