News February 26, 2025

సైబర్ నేరాలపై అవగాహన అవసరం: ఎస్పీ

image

ప్రజలు సైబర్ మోసాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ మోసాలపై వివరించాలన్నారు. అనుమానితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.

Similar News

News February 26, 2025

శివరాత్రి ఉత్సవాలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.

News February 26, 2025

గ్రామాల్లో మహిళా పోలీసులు ఇంటింటా అవగాహన కల్పించాలి: ఎస్పీ

image

గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు వర్క్‌షాప్ నిర్వహించారు. అందరూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సెల్ ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా జరిగే నష్టాలను వివరించాలన్నారు.

News February 25, 2025

అనంతపురం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

☛ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
☛ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
☛ మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో HLCకి నీరు విడుదల
☛ ఉల్లికల్లులో ఉరివేసుకొని హరి అనే వ్యక్తి ఆత్మహత్య
☛ తాడిపత్రి మండలంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
☛ ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన అనంతపురం కలెక్టర్
☛ గుత్తి-తాడిపత్రి మధ్య డ్రోన్ నిఘా
☛ అనంతపురంలో రైలు కింద పడి యువకుడి మృతి

error: Content is protected !!