News September 8, 2025
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి: వరంగల్ సీపీ

ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 56 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 ఫైనాన్స్ కేసులు, 6 నాన్ ఫైనాన్స్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. చాలా వరకు చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నట్లు తెలిపారు. ఎవరైనా మోసపోతే తక్షణమే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News September 8, 2025
JGTL గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో JGTL గురుకులంలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి, జిల్లా మహిళా సాధికారత బృందం ఈ 10 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సదస్సు నిర్వహించింది. రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
News September 8, 2025
NZB: ఈ నెల 10న తుది ఓటరు జాబితా

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News September 8, 2025
ఆస్ట్రేలియాలో ఈ వస్తువులకు నో ఎంట్రీ

మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.