News December 3, 2025
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భూపాలపల్లి జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం విద్యార్థులకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల రూపంలో నష్టం జరుగుతోందన్నారు. దీనికి నివారణ ప్రజల్లో అవగాహన పెంపే ప్రధాన మార్గమని,విద్యార్థులు సైబర్ భద్రతపై తమ కుటుంబాలు, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.
News April 14, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.
News April 14, 2026
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు!

ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో TG బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా ఉండేవి. ఇకపై వాటిని తగ్గించి APSRTC ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే.


