News October 26, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ADB SP

సైబర్ నేరాలు ఎన్నో రకాలుగా జరుగుతూ ప్రజల ఆర్థిక నష్టాలకు కారణమవుతున్న సందర్భంగా ప్రజలకు అప్రమత్తతో వ్యవహరించడం తప్పనిసరిగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గతవారం జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి 29 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ కు గురైన వెంటనే 1930 కి సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 25, 2025
రైతులకు నష్టం జరగకుండా పటిష్ట చర్యలు: కలెక్టర్

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజార్షిషా తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 27, 2025 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రైతులకు ఎంఎస్‌పీ (MSP) ధర లభించేలా CCI కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
News October 25, 2025
ADB: యూట్యూబ్‌లో యువతి పరిచయం.. రూ.8 లక్షల టోకరా

యూట్యూబ్లో పరిచయమై రూ.8 లక్షలకు యువతి టోకరా ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్‌లో బంగారు నగల పని చేసే వ్యక్తి 10 నెలల కిందట యూట్యూబ్ చూస్తుండగా ఒక నెంబరు రాగా.. HYD కు చెందిన కృష్ణవేణి పరిచయమైంది. అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ విడతల వారీగా బాధితుని నుంచి రూ.8లక్షల వరకు ఆమె తీసుకుంది. యువతికి డబ్బుల అడగగా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించింది. దీంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.
News October 25, 2025
మొక్కల నాటే లక్ష్యం వంద శాతం పూర్తి: ఆదిలాబాద్ కలెక్టర్

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న మొక్కల నాటకం వంద శాతం పూర్తయిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు ఈత 23,400, మహువా 70,187, బాంబు 1,04,583 మొక్కలు నాటడం జరిగిందని, జియో ట్యాగింగ్ 97 శాతం పూర్తయిందని వివరించారు. పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 17,27,726 మొక్కలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 48 పాఠశాలల్లో 4,250 కూరగాయల మొక్కలు నాటినట్లు తెలిపారు.


