News December 12, 2024
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితలకు మోసపోయి సైబర్ నేరగాళ్లు వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే, బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
Similar News
News December 27, 2025
ఉగాది లోపు పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆప్షన్–3 కింద నిర్మాణంలో ఉన్న 10,034 ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న 6వేల ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హౌసింగ్ పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 2,522 ఇళ్లలో లోపాలు గుర్తించామని తెలిపారు. వాటిలో 868 ఇళ్ల లోపాలు సరిచేశామని, మిగిలినవన్నీ వారంలోపు పూర్తి చేయాలన్నారు.
News December 27, 2025
కర్నూలు జిల్లాలో డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ.!

జనవరి 1, 2026న పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముందుగానే డిసెంబర్ 31వ తేదీన వందశాతం లబ్ధిదారులకు అందజేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, పెన్షన్ పంపిణీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 30న పెన్షన్ మొత్తాన్ని డ్రాచేసి సేఫ్ కస్టడీలో ఉంచుకుని, 31 ఉదయం 6.30 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని తెలిపారు.
News December 27, 2025
21,033 మంది శక్తి యాప్ డౌన్‌లోడ్: ఎస్పీ

కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్‌లు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, డయల్ 112, 1930 వంటి సేవల వినియోగంపై విద్యార్థినులకు వివరించామన్నారు. జనవరి నుంచి డిసెంబర్ 27 వరకు జిల్లాలో 21,033 మంది శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.


