News February 7, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738851249801_19090094-normal-WIFI.webp)
సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News February 7, 2025
నేడు క్యాబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738865436895_695-normal-WIFI.webp)
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్‌సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.
News February 7, 2025
ఎంపీటీసీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738855988761_52021735-normal-WIFI.webp)
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీలు 5, జీపీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC- 230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.
News February 7, 2025
సంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738849136768_52141451-normal-WIFI.webp)
అంగన్వాడీ ఉద్యోగులు వివిధ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.