News August 10, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ADB SP

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. అపరిచితులకు OTPలు చెప్పడం, ఫోన్‌కు వచ్చే లింక్‌లు ఓపెన్ చేయడం, APK అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయకూడదన్నారు. ఈ వారం జిల్లాలో మొత్తం 21 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్‌కు గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 9, 2025
ఆదిలాబాద్ – నాందేడ్ రైలు ఆలస్యం

నాందేడ్ డివిజన్‌లో రైల్వేలైన్ క్రాస్‌ఓవర్ కనెక్షన్ పనుల కారణంగా ఆదిలాబాద్ – నాందేడ్ రైలు (17409) ఆలస్యంగా నడవనుంది. ఈ నెల 15, 17, 18, 24, 25, 26 తేదీల్లో ఈ రైలు ఆలస్యంగా బయలుదేరుతుందని, మధ్యలో ఒక స్టేషన్‌లో ఎక్కువ సమయం ఆగుతుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
News September 9, 2025
ADB: ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్.. ఐదుగురిపై కేసు

ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణానికి చెందిన గణేష్, గౌతం, ప్రశాంత్, మునీశ్వర్, మహేష్ ఎమ్మెల్యే పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారన్నారు. వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన పోస్టులు గొడవలకు దారి తీసేలా ఉండటంతో నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.
News September 9, 2025
ఆదిలాబాద్: ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమావేశం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాజర్షి షా క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రచురణపై ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై చర్చించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు.