News January 8, 2025

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

‘పాన్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే.. ఈ రోజే మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ వచ్చే మెసెజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి లింకులు/apk ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయకూడదన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే బాధితులు 1930 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.

Similar News

News January 8, 2025

20న దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు

image

ఈనెల 20న కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఆయన బుధవారం వికలాంగుల సంక్షేమ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.

News January 8, 2025

కర్నూలు: పెళ్లయిన 21 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

పెళ్లయిన 21 రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. కర్నూలుకు చెందిన రాకేశ్ గౌడ్(34)కు కొన్ని రోజుల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకొని అరుణ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 8, 2025

రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

image

పాణ్యం మండలంలోని పిన్నాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, పిన్నాపురంలోని గ్రీన్ సోలార్ పార్కును, పంపింగ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం పవర్ హౌస్‌ను సందర్శిస్తారని తెలిపారు.