News December 26, 2025

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం అంటూ వాట్సాప్‌లో వచ్చే లింకులు, యాప్‌లు, APK ఫైళ్లు మోసపూరితమైనవని తెలిపారు. PM-KISan, ముద్ర లోన్ పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, OTP సమాచారం ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

Similar News

News December 26, 2025

రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

image

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

News December 26, 2025

జగన్ బెదిరింపులకు భయపడే వారు లేరు: మంత్రి సవిత

image

పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ బెదిరించడంపై మంత్రి సవిత మండిపడ్డారు. శుక్రవారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. దౌర్జన్యాలతో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జగన్ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News December 26, 2025

వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. వాడపల్లికి 4 వరుసల రోడ్డు!

image

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని 4వరుసలుగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ ఆధునిక రహదారిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.