News February 14, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 16, 2026

ఎన్నికల కోడ్ ఉపసంహరణ: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిను తక్షణమే ఉపసంహరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినందున మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఇకపై వర్తించవని స్పష్టం చేశారు.

News February 16, 2026

ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో అరుదైన దృశ్యం

image

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.