News April 16, 2024
సైబర్ మోసాలు.. పుస్తకాన్ని ఆవిష్కరించిన విశాఖ పోలీసులు

ప్రజలు సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. సైబర్ మోసాలు నివారణపై తెలుగు ఇంగ్లీష్‌లో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొరియర్ ద్వారా పార్సిల్ వచ్చిందని ఆగంతకులు ఫోన్ చేస్తే నమ్మవద్దని అన్నారు. మోసానికి ఎవరైనా గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News October 8, 2025
ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్

ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.