News October 11, 2025
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: MHBD SP

మహబూబాబాద్ జిల్లా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ వాగ్దానాల పేరుతో పెట్టుబడి మోసాలు, డిజిటల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ను నమ్మవద్దన్నారు. సైబర్ నేరాల బారిన పడినవారు 1930, డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Similar News
News October 11, 2025
ఛార్మీతో రిలేషన్‌పై స్పందించిన పూరీ

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.
News October 11, 2025
యానంలో యువకుడి దారుణ హత్య

కేంద్రపాలిత ప్రాంతం యానంలో శనివారం దారుణ హత్య జరిగింది. సినిమా హాల్ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కాజులూరు మండలానికి చెందిన తిపిరిశెట్టి నారాయణ స్వామి (33) తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 11, 2025
AIకి అధిక విద్యుత్ ఎందుకు అవసరం?

AI, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేసే కాలిక్యులేషన్స్‌కు GPU, TPUల వంటి హై-పవర్ హార్డ్‌వేర్ అవసరం అవుతుంది. ఆ హార్డ్‌వేర్, వాటి నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి కూలింగ్ వ్యవస్థలూ <<17977805>>హైపవర్<<>>ను డిమాండ్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ శిక్షణకు వేల గంటల పాటు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. అలాగే డేటా సెంటర్లలోని సర్వర్లు, నెట్‌వర్కింగ్ సామగ్రికీ.. 24/7 AI సేవలకు అధిక విద్యుత్ కావాల్సి ఉంటుంది.