News December 15, 2025

సైబర్ మోసాల పట్ల అప్రమత్తం: సీపీ

image

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన  అవగాహన పోస్టర్లను సోమవారం సీపీ ఆవిష్కరించారు. పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలే ఆర్టీసీ లక్ష్యం: ఎండీ నాగిరెడ్డి

image

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వైస్ చైర్మన్ & ఎండీ వై.నాగిరెడ్డి సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మం ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన కొత్త బస్టాండ్‌లోని పరిసరాలను సందర్శించారు. అనంతరం బస్టాండ్‌లో వసతులు, పరిశుభ్రత, అధికారుల పనితీరు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు.

News December 15, 2025

ఉపాధ్యాయ శిక్షణ, నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ

image

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సోమవారం లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల శిక్షణ, డిజిటల్ బోధన ప్రభావం, సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి కేటాయించిన నిధుల వినియోగంపై వివరణ తెలపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. శిక్షణ ఫలితాలు, నిధుల వినియోగంపై కేంద్రం నుంచి పూర్తి వివరాలు తెలుపాలని ఎంపీ కోరినట్లు సమాచారం.

News December 15, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్ అనుదీప్

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే మాయమాటలు నమ్మవద్దని, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదన్నారు. అపరిచిత లింకులు తెరవవద్దని, మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.