News July 10, 2024

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సత్యసాయి ఎస్పీ

image

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త రకాలైన సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ట్రేడింగ్ మోసాలు, హాని ట్రాప్, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తయారుచేసిన పోస్టర్లను విడుదల చేశారు. తక్కువ సమయంలో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశను ఎంచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News February 17, 2026

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శిల్పారామం, గుత్తి కోట ఉత్సవాలు, బోటింగ్, హెరిటేజ్ వాక్ కార్యక్రమాలను నాణ్యతగా అమలు చేసి పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు.

News February 17, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 72 పిటిషన్ల స్వీకరణ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్ 72 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కార్యాలయానికి విచ్చేసిన ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి పిటిషన్ స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.

News February 16, 2026

ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.