News April 9, 2025

సైబర్ సేఫ్ జిల్లాగా నంద్యాల: SP

image

నంద్యాల జిల్లాను సైబర్ సేఫ్ జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరని స్పష్టం చేశారు. మహిళలు ఆన్‌లైన్ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరిట విదేశీ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత వాట్సప్ సందేశాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News April 17, 2025

తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఈనెల 19న మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఈ మాసంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

News April 17, 2025

కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 17, 2025

పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

image

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.

error: Content is protected !!