News April 8, 2025
సొంతింటి కలను నెరవేర్చిన సీఎం

ఓ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తిరుచానూరు పర్యనకు జనవరి 12న వచ్చిన సీఎంను లీలావతి, శరవణ దంపతులు కలిశారు. తమకు ఇంటితో పాటు, ఆర్థిక సహాయం చేయాలని సీఎంను వేడుకున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ లీలావతి దంపతులకు రూ.లక్ష చెక్కుతో, ఇంటిని మంజూరు చేశారు.
Similar News
News April 8, 2025
GNT: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.
News April 8, 2025
కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 40.8 డిగ్రీలు, బీర్కూర్ 40.7, గాంధారి 40.5, దోమకొండ 40.4, డోంగ్లి 40.2, మద్నూర్, నస్రుల్లాబాద్ 40.1, కామారెడ్డి 40, నిజాంసాగర్, బిక్నూర్ 39.9, బాన్సువాడ 39.8, రామారెడ్డి, బిచ్కుంద, రాజంపేట, లింగంపేట్ మండలాల్లో 39.7, బిబిపేట్, పిట్లంలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
News April 8, 2025
గద్వాల: ‘ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలి’

గద్వాల మున్సిపాలిటీ 17వ వార్డులోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్‌కు స్థానికులు వినతి పత్రం సమర్పించారు. 17వ వార్డు పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ భూమిని రాజకీయ ప్రమేయంతో కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని సీనియర్ సిటిజనం ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు.