News February 24, 2026

సొంతిళ్లు లేని వారికి శుభవార్త

image

AP: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8.29 లక్షలు, స్థలం+ఇంటి కోసం 2.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరోసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్‌లో ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనుంది.

Similar News

News February 27, 2026

SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

image

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in

News February 27, 2026

నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

image

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే ప్రమాదమే అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే సమయానికి, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.

News February 27, 2026

విడాకులు కోరిన హీరో విజయ్‌ భార్య

image

తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్‌కు ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చారు. భర్త నుంచి విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20న విచారణకు రావాలని విజయ్‌కు నోటీసులిచ్చింది. 2025 నుంచి వీరు విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో వీరి వివాహం జరగ్గా ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. పెళ్లైన 26ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతోంది.