News October 24, 2024

సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడు: ఉమా

image

తన సొంత చెల్లి షర్మిలకు చట్టపక్రారం చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఆస్తులు లాక్కునేందుకు సెప్టెంబర్ 10న మాజీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్లు దాఖలు చేశాడన్నారు. తల్లిపైనే కేసులు పెట్టి, చెల్లిని మోసం చేసే నైజం జగన్‌దని ఉమా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

Similar News

News February 17, 2026

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* మానవత్వం చాటుకున్న మంత్రి సత్య కుమార్
* కృష్ణా : మంత్రి ఇలకాలో లిక్కర్ పంచాయతీ
* కృష్ణా : బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
* కృష్ణా : పోలీసుల వినూతన కార్యక్రమాలు
* రాజీవ్ నగర్ కాలనీలో పేకాట శిబిరంపై దాడి
* గుడివాడ: నత్త నడకన ఫ్లైఓవర్ పనులు

News February 17, 2026

కృష్ణా: ఈ దృశ్యం..ఏం చెబుతోంది?

image

కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం-విజయవాడ 216 జాతీయ రహదారిపై గూడూరు సెంటర్ వద్ద ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గూడూరు పోలీసులు మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా, యాక్సిడెంట్‌లో నుజ్జునుజ్జు అయిన వాహనాన్ని ఆ మార్గంలో ఉంచి వారికి అవగాహన కల్పిస్తున్నారు.

News February 16, 2026

కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.