News December 23, 2025

సొసైటీల ఎన్నికలు రద్దు?

image

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో వందశాతం పదవులు కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కనున్నాయి. ఎన్నికల ఖర్చూ మిగలనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 24, 2025

కుంభమేళా to ఇండిగో గందరగోళం: 2025లో కీలక ఘటనలు

image

ఈ ఏడాది మహా కుంభమేళాతో మొదలైంది. పహల్గామ్ దాడి, ఢిల్లీ ఎర్రకోట పేలుడు భయాందోళనలు రేపాయి. బదులుగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆర్థికంగా ట్రంప్ టారిఫ్స్ షాకిచ్చినా, మోదీ పర్యటన వల్ల చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, జీఎస్టీ సంస్కరణలు, నక్సల్స్ ఏరివేత ప్రధాన వార్తలుగా నిలిచాయి. చివరగా ఇండిగో విమానాల రద్దు వేలమందిని ఇబ్బంది పెట్టింది.

News December 24, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

News December 24, 2025

మేకర్స్ Vs థియేటర్ ఓనర్స్.. ఫ్యాన్స్ వర్రీస్

image

టికెట్ రేట్ కంటే థియేటర్ల పాప్‌కార్న్ ధరే ఎక్కువన్న డైరెక్టర్ తేజ <<18658964>>కామెంట్స్<<>> చర్చనీయాంశమయ్యాయి. అది వాస్తవమే అయినా ప్రీమియర్స్ పేరిట టికెట్ ధరను రూ.600 చేయడం కరెక్టేనా? ఒకప్పుడు 10/20 రూపాయలకే టాకీస్‌లో సినిమా చూసిన సామాన్య సినీ అభిమాని ఇప్పుడు థియేటర్‌ అంటేనే ‘అమ్మో’ అంటున్నాడు. టికెట్ ధరలు భారీగా పెంచడంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ పేరిట దోపిడీతో సినిమా చూడాలంటే వేల రూపాయలు పెట్టాల్సిందే.