News June 28, 2024

సోంపేట: నాటుసారా తయారీని అరికట్టేందుకు దాడులు

image

సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News July 1, 2024

శ్రీకాకుళం: దోమల నివారణను అజెండాగా స్వీకరిద్దాం

image

దోమల నివారణను ఎజెండాగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని పిలుపునిచ్చారు. నగరంలోని డీఎంహెచ్ ఓ కార్యాలయం వద్ద డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు ప్రబలకుండా కాలువల్లో స్ప్రేయింగ్ చేయాలన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం వ్యాప్తంగా 1,43,008 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.40 గంటలకు 1,43,008 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా ఇప్పటికే జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ పై ఆరా తీసిన జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో పరిశీలించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛను అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజే శత శాతం పూర్తి కావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.