News April 6, 2025

సోంపేట మండల యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

image

ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి  గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News April 7, 2025

మడపాం: వంశధార నదిలో జారిపడి మత్స్యకారుడు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన వాడ అంజలి అప్పన్న నదిలో వల విసరగా పెద్ద బండరాయి వలకు తగిలింది. చేపలు పడి ఉంటాయని గట్టిగా లాగడంతో జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2025

రాములోరి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్

image

శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి శ్రీశైన వీధిలో ఉన్న శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని రాములోరికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీకాకుళం MLA గొండు శంకర్ హాజరయ్యారు. వేద పండితులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో కేంద్రమంత్రికి, శాసనసభ్యులకు స్వాగతం పలికారు.

News April 6, 2025

త్రిపురాన విజయ్‌తో ముచ్చటించిన ధోనీ

image

టెక్కలికి చెందిన యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్‌ త్రిపురాన విజయ్‌తో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ధోనీ ముచ్చటించారు. చపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని విజయ్ కలిశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఐపీఎల్‌కు ఎంపికైన విజయ్‌ను ధోనీ అభినందించారు.

error: Content is protected !!