News April 14, 2024

సోంపేట: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం గ్రామం నుంచి బెంకిలి గ్రామానికి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై డొక్కరి నరేష్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డొక్కరి నరేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలతో బయటపడడంతో.. హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

News September 10, 2025

SKLM: 11న డయల్ యువర్ ఆర్ఎం

image

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసే క్రమంలో అవగాహన కోసం డైల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు 99592 25603 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ఊరట

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హైదరాబాద్(HYB)- భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB- BBS రైలును ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును నేటి (బుధవారం) నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.