News March 10, 2025
సోంపేట: 5 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.
Similar News
News March 10, 2025
SKLM: ఎస్పీ గ్రీవెన్స్‌లో 52 వినతలు స్వీకరణ

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 52 వినతిపత్రాలు స్వీకరించామన్నారు.
News March 10, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.
News March 10, 2025
శ్రీకాకుళం: భక్తులకు నేడు నిరాశే మిగిలింది..!

అరసవల్లి సూర్యభగవానుడు రెండో రోజు కూడా భక్తులను కరుణించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదివారం ఆదిత్యుడిని తాకలేదు. దీంతో ఎంతో ఆశతో దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు సోమవారం కూడా మంచు, మబ్బులు కారణంగా భానుడు ఆదిత్యుని పాదాలు తాకలేదు.