News December 31, 2025
సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన మూడో కూతురి పెళ్లి చేశాడు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌కు ఇచ్చి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో DEC 26న వివాహం జరిపించాడని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ISI చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా మునీర్‌కు నలుగురు కూతుళ్లు. అబ్దుల్ రహమాన్ ఆర్మీలో పని చేసి రిజర్వేషన్ కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.
Similar News
News January 1, 2026
MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, డిప్లొమా, డిగ్రీ, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ, పర్చేజ్ ఇంఛార్జ్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్‌సైట్: www.msmetcvizag.org
News January 1, 2026
పుతిన్ నివాసంపై దాడి అబద్ధం.. రష్యాకు CIA షాక్

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్‌నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 1, 2026
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ GOపై హైకోర్టు నోటీసులు

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.


