News April 16, 2025
సోన్: ‘గల్ఫ్‌లో యువకుడి హత్య.. MLA ఏలేటి భరోసా

సోన్‌కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
ఇక నుంచి తిరుపతి జిల్లాపై కాసుల వర్షం.?

తిరుపతి జిల్లాకు మరింత ఆదాయం రానుంది. దుగరాజపట్నం వద్ద ఓడరేవుతోపాటు నౌకా నిర్మాణ కేంద్రానికి CM సానుకూలంగా ఉన్నారు. ఈ ఓడరేవు ద్వారా GOVTకు ఏటా రూ.12-15వేల కోట్ల ఆదాయం రానుందట. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది. R.కోడూరులోని మంగంపేట గనుల నుంచి రూ.12-18 వందల కోట్ల ఆదాయం రానుందట. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన 74 మిలియన్ టన్నుల ముగ్గురాయి ఉంది. దీనిని దాదాపు 30 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
News January 2, 2026
వికారాబాద్: ఈ ఫ్యామిలీ GREAT

‘కలసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం’ అంటుంది VKBలోని బొంరాస్‌పేట మండలానికి చెందిన నీరటి నర్సమ్మ కుటుంబం. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో నేటికీ మేము కలిసే ఉంటున్నామంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు మొత్తం నలుగురు కుమారులు, వారి భార్యలు, ఆరుగురు మనవళ్లు,11 మంది మనవరాళ్లు, ముని మనవడు, ముని మనువరాలు మొత్తం 27 మంది ఒకే దగ్గర ఉంటూ అన్ని కార్యక్రమాలను కలిసి నిర్వహించుకుంటున్నారు.
News January 2, 2026
వరంగల్ తూర్పులో పీక్స్‌కు చేరిన వైరం!

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు పీక్ స్థాయికి చేరింది. MLC, మాజీ MLCల వర్గాలు వీడిపోయాయి. గత రెండేళ్లలో వరంగల్ డివిజన్ పోలీసులు నమోదు చేసిన కేసులను తిరుగతోడుతున్నారు. కాంగ్రెస్‌కి చెందిన నాయకులపైనే బనాయించిన కేసులను మళ్లీ విచారణ చేయాలని, వాటిని నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాసిన లేఖ కలకలం రేపుతోంది.


