News February 8, 2025

సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు

image

నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు. 

Similar News

News February 8, 2025

పెంబి: పురుగుమందు తాగి వివాహిత మృతి

image

పురుగు మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలావత్ సానుక(22)ను ఆమె భర్త ఈనెల 3న మొక్కజొన్న పంటకు నీళ్లు పారీయమని చెప్పగా ఆమె క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 8, 2025

లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.

News February 8, 2025

PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్

image

‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.

error: Content is protected !!